తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఐస్ క్రీం తయారీ కేంద్రాలు, మరియు వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయడం జరిగింది. పరిశుభ్రతను మరియు నాణ్యత ప్రమాణాలను పాటించని వారికి జరిమానాలు విధించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ ఐస్ క్రీమ్ తయారీ దారులు నాణ్యత ప్రమాణాలను, పరిశుభ్రతను పాటించాలని, మరియు వాటర్ ప్లాంట్ యజమానులు ఐ ఎస్ ఐ లైసెన్స్ ను తీసుకోవాలని ఆయన తెలియజేశారు. లేనియెడల తెలంగాణ పురపాలకల చట్టం 2019 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ అంజయ్య మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
.