సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త,కటుకం గణేశ్ కు విశిష్ట రక్తదాన సంధానకర్త అవార్డు

తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గత17 ఏళ్లుగా రక్తదాన సంధాన కర్తగా 4250 మందికి అవసరం ఉన్న పేషెంట్లకు రక్తదాతల ద్వారా రక్తాన్ని ఇప్పించి, పైగా రక్తదాన సంధాన కర్తగా, సామాజిక సేవలు చేస్తున్న కటుకం గణేష్ కు తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ ,తెలంగాణ పెన్షనర్స్ జిల్లా సంఘాలు "విశిష్ట రక్తదాన సంధాన కర్త" గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక అవార్డును  అందజేశారు.

శుక్రవారం తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ కార్యాలయంలో ఆ సంఘాల రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,కోరుట్ల డివిజన్ ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవీందర్ చేతుల మీదుగా కోరుట్ల నివాసి కటుకం గణేష్ కు "విశిష్ట రక్తదాన సంధానకర్త"గా నేతాజీ స్మారక అవార్డు    అందించి ,పట్టు శాలువాలు ,కిరీటధారణ చేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీందర్ లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 4250 మంది పేషంట్లకు రక్తదాతలతో రక్తాన్ని ఇప్పించే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయించడాన్ని వారు కొనియాడారు.

రక్త దానం పై యువతీయువకుల్లో ఉన్న అపోహలను, అవగాహనతో తొలగించి, రక్త దానం కొరకు కృషి చేసిన  విశిష్ట వ్యక్తి అని వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్ రవీందర్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా నాయకులు బొల్లం విజయ్,పి.సి.హన్మంత్ రెడ్డి,వి.ప్రకాష్ రావు,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి రాజ్ మోహన్,కోశాధికారి లక్ష్మి నారాయణ,ఉపాధ్యక్షుడు ఎం.డి.సైఫోద్దీన్,సాబిత్ అలీ,రాములు,రాజయ్య,భూమయ్య, కల్లూరు సర్పంచ్  వనతడుపుల అంజయ్య,తదితరులు పాల్గొన్నారు

.