ఘనంగా కృషి హై స్కూల్ 15వ వార్షికోత్సవం

కృషి ఉంటే మనుషులు ఋషలవుతారు.......

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): సుభాష్ నగర్ డివిజన్ సురారం కాలనీ రామ్ లీల మైదానంలో కృషి హై స్కూల్  15వ వార్షికోత్సవం కరస్పాండెంట్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి సురారం సి ఐ వేంకటేశం, సుభాష్ నగర్ డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ముఖ్య అథితులుగా హాజరయ్యారు.కృషి హై స్కూల్ , కృషి గ్రీన్ హిల్స్ బ్రాంచ్ పిల్లలు చిట్టి చిట్టి అడుగులతో డాన్స్ లు వేసి తల్లి తండ్రులను అలరించారు.నర్సరీ నుండి పదవతరగతి విద్యార్థులు చాలా చక్కగా భగవంతుని వేషధారణ లో డాన్స్ లు వేసి అందరిని ఆకట్టుకున్నారు.సీ ఐ వేంకటేశం మాట్లాడుతూ  పిల్లలకు తల్లి తండ్రులు చదువు తో పాటు,ఆట పాటలతో డాన్స్ ప్రోగ్రాంలలో కూడా ముందుండాలని క్రమశిక్షణ తో పెంచాలని వారినీ సరైన పద్దతిలో  చదివంచాలని అన్నారు.పాఠశాల కరస్పాండెంట్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ చాలా చిన్న పేదరికం మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను అని దీనికి నిలువెత్తు నిదర్శనం తన తల్లి వనజ కుమారి  అని వేరే పాఠశాలలో చదువు చెపుతూ అక్కడ వచ్చిన డబ్బులతో ఈ కృషి హై స్కూల్ లో చెప్పే ఉపాధ్యాయులకు సాలరీ లు ఇచ్చి నడిపామని అన్నారు . అంతే కాకుండా తనుకూడా స్కాలర్ షిప్ పైనే చుదువుకున్నానని ఇప్పుడు కృషి హై స్కూల్ లో చదివే విద్యార్థులకు పదవ తరగతి ఉత్తీర్ణులై 1 ర్యాన్క్ 2 ర్యాన్క్ సాధించిన విధార్ధులకు స్కాలర్ షిప్ అందిస్తున్నామని అన్నారు.ఆ రోజు  200 మంది పిల్లలతో ఈ రోజు 1300 వందల మంది పిల్లలు చదువుతున్నారని సగర్వంగా చెప్పారు.తన తల్లికి ఇచ్చిన మాట 2000 పిల్లలతో కృషి చూడాలనే కోరిక నెరవేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా డిస్టిక్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి, శివయ్య,శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్,ఆంజనేయులు, వినోద్, ఇతర పాఠశాల ల కరస్పాండెంట్ లు,మరియు స్థానిక నాయకులు రవీందర్,రవి, శ్రీనివాస్,మరియు విద్యార్థుల తల్లి తండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

.