ముమ్మరంగా పనిచేద్దాం.... మల్కాజిగిరిలో గులాబీ జెండా ఎగురవేద్దాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద .

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన రాగిడి లక్ష్మారెడ్డి 

ఈరోజు ఉదయం కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తన గెలుపుకు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో మీరు అందుకోబోయే గెలుపులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీని అందిస్తామన్నారు. గత ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి కి చేసింది ఏమీలేదన్నారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేటర్ ఆగం రాజు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు,  పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.