తెలంగాణ ప్రభ (కోరుట్ల): పద్మశాలీల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ ను ప్రకటించడంతో కోరుట్ల మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఆడెపు కమల హర్షం వ్యక్తం చేశారు
గత ప్రభుత్వ హయాంలో పద్మశాలిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, గతంలో ఎంత వేడుకున్న, గత ప్రభుత్వం పద్మశాలీలను పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలలోనే పద్మశాలీలకు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వామని,
నిరూపించారని ఆమె అన్నారు
బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ పద్మశాలి కులస్తులకు అండగా ఉంటూ, కార్పోరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా నిరుపేదలు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఈ ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని శ్రీమతి ఆడెపు కమల పేర్కొన్నారు.
పద్మశాలీలు అంటేనే నేతన్నలు,భారత దేశంలోనే నేతన్నలు లేకుంటే, మనం ధరించే బట్టలు ఎలా తయారు అవుతాయని ఆమె అన్నారు.
పద్మశాలీలు స్వాతంత్ర పోరాటం నుండి ఈనాటి తెలంగాణ ఉద్యమం దాకా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆనాడు ఢిల్లీలో ఎముకలు గడ్డ కట్టే చలిలో ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారని, అలాగే సాయుధ రైతాంగ పోరాటంలో రైతులను ప్రజలను చాలావరకు మేల్కొల్పిన కవి ఎవరైనా ఉన్నారా అంటే అది సుద్దాల హనుమంతు అనీ పద్మశాలి సమాజం యొక్క కృషి వల్ల ఉద్యమాలు కొనసాగించిన, గత తెలంగాణ ప్రభుత్వం గుర్తించక పోయిన, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం చాలా ఆనందదాయకమని, పద్మశాలి కార్పొరేషన్ కు కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు లకు మా పద్మశాలీల పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఆడెపు కమల తెలిపారు
.