మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): మహిళలు,యువతులు,బాలికలు ఆకతాయిల వలన గానీ,మరే విధమైన వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీటీమ్స్ ని సంప్రదించవచ్చని  తెలిపారు.జిల్లాలో   విద్యార్థినులు,మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ లకు గురైనా,మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా,బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు తెలుపాలి మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని,వాటిలో ఫొటోలు,వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నేరుగా  8712656425 ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం  జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల వల్లంపట్ల ప్రధానోపాధ్యాయులు దూస గోవర్ధన్ ,ఉపాధ్యాయినీలు లక్ష్మి , ప్రేమలత,రజిత గారు మరియు ఉపాద్యాయులు పి.వంశిధర్ రెడ్డి ,కృష్ణ రెడ్డి, రాజేందర్,విద్యార్థినీ, విద్యార్థులు  మరియు, షీ టీం సభ్యులు పాల్గొన్నారు.

.