తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి కోరుట్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఆర్యవైశ్యులు ఎన్నో సంవత్సరాలుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి చాలాసార్లు గత ప్రభుత్వాలకు ఎన్నో వినతి పత్రాలు అందించడం జరిగినది. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు నోచుకోలేదు కానీ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు గురించి స్పష్టమైన హామీ ఇచ్చిన సందర్భంగా గురువారం రోజున కోరుట్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వారికి క్షీరాభిషేకం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పట్టనాధ్యక్షుడు మోటూరి రాజు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఆర్యవైశ్యుల అభివృద్ధికి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు చేసిన పోరాటం ఫలితంగా నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతి తెలియజేయడంతో ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులకు ఎంతో ఉపయోగపడుతుందని వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ఈ కార్పొరేషన్ చాలా సహాయపడుతుందని ఇట్టి కార్పొరేషన్ ద్వారా పేద ఆర్యవైశ్యులందరూ ప్రయోజనం పొందవచ్చు అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మోటూరి రాజు, మాజీ అధ్యక్షుడు మంచాల జగన్, ముక్క రాము, గ్యాధే సాయి, గుడిసె కోటేష్, కముటాల భాస్కర్, రవీందర్, ఎర్ర ప్రభాకర్, కొత్త రాజేష్, జె. శ్రీకాంత్, కోటగిరి విశ్వనాథ్, మొదలగు సభ్యులందరూ పాల్గొన్నారు.
.