రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద క్యూసీసీఏ ఛైర్మన్, జీడిమెట్ల గ్రేస్ కాస్పల్ చర్చ్ పాస్టర్ శౌరి బోల్లేదు ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ కు చెందిన పలువురు పాస్టర్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి  మార్చి 16వ తేదీన శనివారం ఉదయం 9 గంటలకు "గ్రేస్ గాస్పల్ చర్చ్ ఆవరణలో నిర్వహించే రక్తదాన శిబిరం" ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద  మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమని, రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా రక్తదానం చేసిన వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటామన్నారు. ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాస్టర్ జాషువా, పాస్టర్ స్మిత్ బాబు, పాస్టర్ ధర్మ రాజు తదితరులు పాల్గొన్నారు.

.