పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్,మెటీరియల్ పంపిణి చేసిన యువకులు

తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పాడ్స్ మరియు మెటీరియల్ పంపిణి చేసిన భూమల్ల ప్రశాంత్, జంగిటి అజయ్.అనంతరం వారు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన పదో తరగతి పరీక్షలు మార్చ్ 18 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి కావున విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి,ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని,ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని తెలిపారు.ప్రతి విద్యార్ధి ఒక లక్షం ఏర్పర్చుకొని ముందుకు సాగాలని,లక్షసాధనలో ఒత్తిడికి లోను కాకూడదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

.