తెలంగాణ ప్రభ(ధర్మపురి): రాష్ట్ర ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి మరియు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్ర పాటలకు బుధవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆర్యవైశ్య నాయకులు పాలాభిషేకం చేసారు.పలువురు మాట్లాడుతూ వైశ్య కార్పొరేషన్ ఇస్తున్నట్టుగా ప్రకటించడం సంతోషంగా ఉందని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మంత్రివర్గముకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం టాపాసులు ముట్టించి సీట్ల పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రవీందర్, మండల అధ్యక్షుడు కూరగాయల సంతోష్ టౌన్ ప్రెసిడెంట్ మురికి శ్రీనివాస్ కార్యదర్శి చౌడారపు సతీష్ కప్పుల శ్రీనివాస్ గుని శెట్టి రవీందర్ పిన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
