తెలంగాణ ప్రభ(ధర్మపురి): తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా ధర్మపురికి చెందిన భీమనాతి శారద ను నియమిస్తూ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మహిళ సాధికారికత కు ఎంతో కృషిచేసిన శారద సేవలను గుర్తించిన రాష్ట్ర నాయకత్వం ఆమెకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. తన నియామకం పట్ల ఆమె రాష్ట్ర అధ్యక్షులు వీర మోహన్ మరియు రాష్ట్ర సంఘాల పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
