తెలంగాణ ప్రభ(ధర్మపురి) బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామం లో బుధవారం సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్ ప్రారంభించారు. ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు &ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఏన్ఆర్ఈజిఎస్ ప్రత్యేక నిధులనుండి రోడ్డు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గోవిందుల రమణ, మండల యూత్ ప్రెసిడెంట్ బిర్పూర్ తిరుపతి,కండ్లే మదన్, రాజేశ్వర్ రెడ్డి, రాజన్న,గైని శ్రీను గైని రమేష్,ఐలయ్య,శేఖర్ రెడ్డి రవీందర్ రెడ్డి,లచ్చన్న కొమ్మినని తిరుపతి అమీర్,సెక్రటరీ నైజం గోవిందుల నారాయణ, చిట్ల సంతు,తుమ్మల రాజేష్,ముత్యాల నాగరాజు, కొమ్మినని నారాయణ, గాజుల సత్తన్న, బిర్పూర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
