తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ రజక సంఘం సభ్యులు రజక సంఘం నాయకులు సింగారం మల్లేష్ అధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి రజక సోదరుల సౌకర్యార్థం"మోడర్న్ దోభి ఘాట్, రజక భవన్" ను నిర్మించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కులవృత్తుల అభివృధ్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అత్మ గౌరవ భవనాలు నిర్మించుకున్నామని, రానున్న రోజుల్లో కూడా రజక సోదరుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు శంకర్, సాయిబాబా, సత్యనారాయణ, వెంకటేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
.