బకాయిలు చెల్లించాలి.. కొత్త ఆర్డర్లు ఇవ్వాలి

చాడా వెంకటరెడ్డి సిపిఐ కేంద్ర కార్యదర్శి.

బాధిత కుటుంబాన్ని పరామర్శ.

సిరిసిల్ల ప్రభ( సిరిసిల్ల): బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి కొత్త ఆర్డర్లు ఇవ్వాలని సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం బి. వై. నగర్ లోని ఇటీవల నేత కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మూతపడ్డా పరమగ్గాల కార్ఖానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల వసపరిశ్రమకు రావలసిన బతుకమ్మ చీరల బకాయిలు 260 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్ తో గత ప్రభుత్వం పరిశ్రమ అచైతనంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పంతం రవి, కడారి రాములు గణేష్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

.