కార్పొరేషన్ లు ఏర్పాటుతో బీసీ కులాల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారు

తెలంగాణ ప్రభ (కోటగిరి): కార్పొరేషన్ లో ఏర్పాటుతో బీసీ కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని బీసీ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 బీసీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ క్యాబినెట్లో తీర్మానించడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేసి  చౌరస్తాలో  టపాకాయలు కాలుస్తూ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు, వీరశైవ లింగాయత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డికి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజ్ ,యాదవ ,కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్ ,మేరు, గంగాపుత్ర ,ఆర్యవైశ్య ,ఏకలవ్య, 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.  రాబోయే రోజుల్లో బీసీ కులాల ఐక్యతతో పాటు అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వాలు బీసీ కులాలను రాజకీయంగా ఓటు బ్యాంకుగా  వాడుకున్నాయని కానీ రేవంత్ రెడ్డి కాపులను ఇతర బీసీ కులాలను అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. బీసీ కులాలు రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా విద్యారంగం ఇతర అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటు అభివృద్ధికి చిహ్నం అని గుర్తు చేశారు.  గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంఘం నాయకులు గంగాధర్ దేశాయ్, రాజేశ్వర్ పటేల్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టం మనోహర్ ,  మాజీ వైస్ ఎంపిపి  వల్లెపల్లి శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల  అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తెల్ల రవికుమార్,  మోత్ పేట రాజయ్య, మక్కయ్య, కూచి శ్రీనివాస్ ,బర్ల మధు, తెల్ల చిన్న అరవింద్, గర్దాస్ ఆనంద్ ,పెద్ద కాపు శ్రీకాంత్ ,కూచి సాయిబాబా, ఎడ్డెడి శంకర్,  ఎడ్డడి గంగారం ,కాంగ్రెస్ నాయకులు సలీం ,అయూబ్, అనంత విట్టల్ ,జలాల్ ,తదితరులు పాల్గొన్నారు.

.