లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో.
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులకు బుధవారం లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలు పెన్నులను పంపిణీ చేశారు. పదవ తరగతి విద్యార్థులకు క్లబ్ సభ్యుల చేతుల మీదుగా 30 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్ మాట్లాడుతూ..... విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. క్లబ్ మాజీ అధ్యక్షులు తెల రవికుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలను రాసేటప్పుడు భయాందోళన గురికాకుండా రాయాలని అన్నారు. కస్తూరిబా విద్యార్థులు మండల స్థాయిలో అగ్రగామిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా ప్రిన్సిపాల్ సవిత రాణి, కర్నే రూప, లైన్స్ ప్రతినిధులు పెద్దకాపు శ్రీకాంత్, తెల్ల చిన్న అరవింద్, యోగేష్, బర్ల అర్పిత్, కస్తూరిబా ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
