గడ్డం జితేందర్ ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిధర్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్  ఆలయ అర్చకులు బిట్కూరి నవీన్ చారి లు పరామర్శించారు,

అంబేద్కరిస్ట్  గడ్డం నర్సయ్య మరణం గురించి  దత్త కుమారుడు జితేందర్ ను వారు  అడిగి తెలుసుకోగా లివర్  ఇన్ ఫెక్షన్  బాదపడుతూ అనారోగ్యానికి గురి కాగా  కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు, 

నర్సయ్య మృతికి వారు ప్రగాఢ సంతాపం ప్రకటించారు,

అదేవిధంగా  అదే గ్రామానికి చెందిన బస్వాపూర్ లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించింది,

ఆమే కుమారులు  ఎల్లయ్య , బుచ్చయ్య లను వారు పరామర్శించారు,

.