పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి
తెలంగాణ ప్రభ, గొల్లపల్లి: ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని , ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ సూచించారు. గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ స్టేషన్ పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు. 5S అమలు తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని, తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు.
డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఆయన సూచించారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి సీ.ఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్.ఐ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు
.