తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సండ్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్ వాడి ఆధ్వర్యంలో పోషణ అభియాన్ లో భాగంగా పోషణ పక్షోచ్చవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులచే పోషణ ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం విద్యార్థులకు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, చెత్తను తొలగించుకోవాలని, గోళ్ళు ప్రతి వారంకి ఒక సారి తీసుకోవాలని, కోడిగ్రుడ్లు, ఆకు కూరలు, పండ్లు, తదితర పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి, అంగన్ వాడి టీచర్ బొక్కెమ్ విజయ లక్ష్మీ,విద్యార్థులు పాల్గొన్నారు.
.