కోరుట్లలో హనుమాన్ దీక్షా స్వాములకు నిత్య అన్నదానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తేదీ 14. 3 .2024. గురువారం రోజు నుండి అంజన్న మాలాధారణ వేసుకున్న స్వాములకు 41 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు 22 వార్డు కౌన్సిలర్ మాడవేని నరేశ్ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమ ప్రారంభోత్సవం కలదు  ఈ కార్యక్రమానికి వార్డు ప్రజలు,దేవాలయ కమిటీ సభ్యులు, దేవాలయ అధ్యక్షులు అందరూవచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించగలరు హనుమాన్ దీక్ష స్వాములు ఒకరోజు ముందుగా చెప్తే 100.. 200. ..300 మంది ఎంతమంది స్వాములు ఉన్నా గాని ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని మాడవేని నరేశ్ తెలిపారు.

ఈ అన్నదాన కార్యక్రమం ఆంజనేయస్వామి మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించబడునని ఆయన తెలిపారు

.