ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఆర్యవైశ్యులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్యవైశ్య కార్పోరేషన్  ఏర్పాటును ప్రకటించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కోరుట్ల పట్టణ, మండల ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేసారు. సంఘ నాయకులు అల్లాడి శ్రీనివాస్  మాట్లాడుతు సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్య వైశ్య కార్పోరేషన్ ప్రకటించడం పట్ల ఎంతో మందీ వైశ్యులకు లబ్ధి చేకూరుతుంధని, ఈ విషయo ప్రతి ఆర్య వైశ్యుడు హర్షించ దగిన విషయమని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో లింగరాజు, పడిగెల శ్రీనివాస్, నూనే నవీన్, చిటిమెల్లి రంజిత్, బూసం సతీష్, గుడిసె శ్రీనివాస్, కొత్త వాసు యువజన నాయకులు గ్యాధే సాయి, వాసవి క్లబ్ సభ్యులు నేతి శ్రీకాంత్, రేగొండ మహేష్, గుడిసె కోటేష్, చింత సాయిరాం, తధితరులు పాల్గొన్నారు.

.