జర్నలిస్టులందరికీ త్వరలో ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు

టియుడబ్లుజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

తెలంగాణ ప్రభ ( సంగారెడ్డి ):తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో త్వరలో సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, హెల్త్ కార్డులు  మంజూరవుతాయని టియుడబ్ల్యూజే (ఐజెయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. హైదరాబాదులోని రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో మంగళవారం నాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారని, సంగారెడ్డి జిల్లా శాఖ తరఫున ఆయనను అభినందించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు. శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఈ విషయాలపై చర్చ జరిగిందని అన్నారు. త్వరలో జిల్లాల వారీగా సమాచారాన్ని సేకరించడంతో పాటు అర్హులకు ఇండ్ల స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. గతంలో లాగా హెల్త్ కార్డులను ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మంజూరు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అంతరాష్ట్ర మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు నగనూరి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొత్త అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి ఎంఏకే ఫైజల్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

.