సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్. డి. ఎఫ్ )పథకం ద్వారా మంచినీటి వసతి కల్పన కోసం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు తెలిపారు
మంగళవారం రోజున తెలంగాణ ప్రభ విలేకరితో మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో తాము కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా వివిధ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య తమ దృష్టికి వచ్చిందని, నియోజకవర్గంలో ఉన్న నీటి సమస్యను కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లారని, దీనిపై తక్షణం స్పందించి నియోజకవర్గానికి కోటి రూపాయలు మంజూరు చేశారని, అందులో నుండి 28 లక్షల రూపాయలు మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు, అలాగే 28 లక్షల రూపాయలు మెటుపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు, కోరుట్ల మండలానికి 22 లక్షల రూపాయలు, ఇబ్రహీంపట్నం మండలానికి 22 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు.
గతంలో తెలంగాణ రాష్ట్రం ను పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ పథకం ద్వారా కోట్లాది రూపాయల నిదులు దుర్వినియోగం చేశారని కాంట్రాక్టర్లకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లాభం చేసి ప్రజలను మోసం చేశారని, వేసవి ప్రారంభం కాకముందే నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య ప్రారంభమైందని ఆయన అన్నారు నిధులు మంజూరు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కృష్ణారావు పేర్కొన్నారు
.