ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ : మెద‌క్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

తెలంగాణ ప్ర‌భ ( ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో ): ఈనెల 9, 10 తేదీలలో మెదక్ జిల్లా రామయంపేట్ లో జరిగిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలల జిల్లాలోని ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ నుండి ఆరుగురు క్రీడాకారులు బంగారు, వెండి, రజత పథకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా మెద‌క్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కూడా రాణించి మన జిల్లా పేరును

భారతదేశ పటంలో ముందు వరుసలో ఉంచాలని శిక్షకుడు యాదగిరికి సూచించారు. ఈనెల 20 నుండి 25 వరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొనబోతున్నారని వివరించారు.

కాగా బంగారు, వెండి పతకాలు సాధించిన వారిలో...16 ఏళ్ళ‌లోపు మాస్టార్ట్ విభాగంలో దిలీప్ బంగారు పతకం, అనుజ్ఞ వెండి పతకం సాధించారు. అలాగే 14 సంవ‌త్స‌రాల‌లోపు మాస్టార్ట్ విభాగంలో ప్రణయ్ బంగారు పతకం, అనిల్ తేజ్ వెండి పతకం, ఇండివిజువల్ టైం ట్రయల్ విభాగంలో సిద్ధార్థ వెండి పతకం, హరీష్ రజత పతకం సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన,క్రీడా శాఖ అధికారి నాగరాజు, సిబ్బంది రాజు క్రీడాకారులు పాల్గొన్నారు.

.