ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షునికి సన్మానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కరస్పాండెంట్ తుమ్మనపెల్లి సత్యనారాయణ ట్రస్మా రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు స్థానిక అక్షర హైస్కూల్లో కోరుట్ల ట్రస్మా సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంతకముందు రాష్ట్ర  ఆర్గనైజింగ్ సెక్రటరీగా జగిత్యాల జిల్లా ట్రాస్మా కోశాధికారిగా పట్టణ ట్రస్మా అధ్యక్షునిగా పని చేశానని, 

ఈ అనుభవంతో రాష్ట్ర ట్రస్మా ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడం సంతోష దాయాకమని, దీనికి సహకరించిన నా తోటి కరస్పాండెంట్ మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. పదవులు శాశ్వతం కాదని కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని, నాకు ఇచ్చిన ఈ భాద్యతను సక్రమంగా నిర్వర్తించి, రాష్ట్ర, జిల్లా మరియు పట్టణ స్థాయిలో ట్రస్మా సంఘ అభివృద్ధికి మరియు పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర స్థాయిలో గళం వినిపిస్తానని ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమం లో  ట్రస్మా జిల్లా కార్యదర్శి బండి మహాదేవ్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చౌకి రమేష్, కూడేల్ రాజేంద్ర ప్రసాద్, దీపక్, భారీ, శంకర్ శర్మ,వెంకట సిద్ధార్త నాగభూషణం, దామోదర్ మరియు సుకుమారన్ పాల్గొన్నారు.

.