యాసంగి ధాన్యం కొనుగోలుకు అన్ని సిద్ధం చేయాలి

ఒక లక్ష 88 వేల టన్నుల లక్ష్యం 

జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వల్లూరు  క్రాంతి సమీక్ష 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): నెల రోజుల్లో పంట కోతకు రానున్న యాసంగి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం జిల్లా పౌరసరఫరాల శాఖ,  మార్కెటింగ్, సంబంధిత శాఖల అధికారులతో రానున్న యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఖాళీ సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించే యంత్రాలు, తూర్పారబట్టే యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు తీసుకొచ్చే ధాన్యం తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు  

జిల్లాలో ఐకెపి సహకార సంఘాల ఆధ్వర్యంలో 84, పిఏసిఎస్ 76, డీసీఎంఎస్ 32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. రైతులు తాము తీసుకువచ్చే ధాన్యంలో తాలు లేకుండా ధాన్యం తూర్పార బట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, డీఏం సివిల్ సప్లై  ప్రశాంత్, డీసీఓ ప్రసాద్, సంబంధిత జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

.