సీనియర్ సిటీజేన్స్ సమాజ మార్గదర్శకులు. విస్మరించేవారు శిక్షార్హులే

కోరుట్ల ఆర్డీవో  ఎన్.ఆనంద్ కుమార్.

తెలంగాణ ప్రభ (కోరుట్ల): సీనియర్ సిటీజేన్స్ సమాజ మార్గదర్శకులని, వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని   కోరుట్ల  ఆర్డీవో ఎన్.ఆనంద్ కుమార్ అన్నారు.

సోమవారం  ఆర్డీవో కార్యాలయంలో  తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా  అధ్యక్షుడు   హరి ఆశోక్ కుమార్   ఆధ్వర్యంలో    కోరుట్ల ఆర్డీవో గా  ఎన్.ఆనంద్ కుమార్  పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా  పుష్పగుచ్ఛం లు అందించి,సన్మానించి  శుభాకాంక్షలు తెలిపారు.

సీనియర్ సిటీజేన్స్ 2024 డైరీ,సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ పిలుపు పత్రికలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ  వయో  వృద్ధులకు రాష్ట్ర,జిల్లాల  వ్యాప్తంగా సేవలు అందిస్తున్న  రాష్ట్ర  కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ను,కోరుట్ల డివిజన్ సీనియర్ సిటీజేన్స్ అధ్యక్ష,కార్యదర్శులు,కౌన్సెలింగ్ అధికారులు  పబ్బా శివానందం,గంటేడి రాజ్ మోహన్ , కోశాధికారి లక్ష్మినారాయణ లను అభినందించారు. వయోవృద్ధుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక  టోల్ ఫ్రీ నెంబర్ 14567  ఉందని,వారిని నిరాదరిస్తున్న, వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలుశిక్ష తో పాటు జరిమానా విధించే వీలుందన్నారు. .

అనంతరం హరి ఆశోక్ కుమార్  మాట్లాడుతూ  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదర్శ ప్రజా ఆర్డీవో గా  ప్రజల మన్ననలు పొందిన ఎన్.ఆనంద్ కుమార్ కోరుట్ల ఆర్డీవో గా రావడంతో కోరుట్ల  డివిజన్ ప్రజలకు   చాలా మేలు జరుగుతుందని  కొనియాడారు.. 

మెట్ పల్లి డివిజన్ లో సీనియర్ సిటీజన్స్ అధ్యక్షుడు పబ్బా శివానందం,రాజ్ మోహన్ ల   ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు  వయోధికులకు సేవలు అందిస్తున్నారని,ఎవరైనా వయోవృద్ద తల్లిదండ్రులు తమ సమస్యల పరిష్కారం కోసం వారు తోడ్పాటు నిస్తారని, గతంలో  కోరుట్ల డివిజన్ లో పరిష్కారం అయిన కేసులను వివరించారు.

ఈ కార్యక్రమంలో  సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ,ఉపాధ్యక్షుడు పి.సి.హన్మంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి రాజ్ మోహన్,  ఉపాధ్యక్షులు సైఫోద్దీన్,లక్ష్మీ నారాయణ, కోరుట్ల డివిజన్ సీనియర్ సిటీజేన్స్ ,పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

.