ఎన్నికల నిర్వహణ భవనాలను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):రానున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఈవీఎంల భద్రత, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్ర ఏర్పాటుకు ప్రతిపాదిత భవనాలను మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మండల కేంద్రంలో  జూనియర్ కళాశాలను పరిశీలించి, చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రతకు గదులు, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన చర్యల గురించి పరిశీలించారు. కాలేజీలకు సెలవులు ఇచ్చిన అనంతరం డిస్ట్రిబ్యూషన్  రిషిప్షన్ కేంద్ర ఏర్పాట్ల పనులు మొదలు పెట్టాలని, ఈవీఎంలు భద్ర పరచుటకు తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్, అదనపు ఈవీఎంలతో సహా భద్రపరచడానికి సరియైన హాల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈవీఎం కమీషనింగ్ కి అనువైన హాల్ ను ఏర్పాటు చేయలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తహసిల్దార్  శ్రీనివాసరావు, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

.