ముత్తాయకోట శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మైనంపల్లి దంపతులు
అవినీతికి తావులేకుండా జాతర ఉత్సవాలను జరిపాం
ఏడుపాయలపై డెవలప్ మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తా
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): యాదాద్రి తరహాలో ఏడుపాయల వనదుర్గభవాని దేవస్థానంను అభివృద్ధి చేస్తానని, ఎన్నడు లేని విధంగా ఈయేడు ఏడుపాయల జాతర ఉత్సవాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంతరావు సుడిగాలి పర్యటన చేశారు. హావేళిఘణపురం మండలం కూచన్ పల్లి గ్రామంలోని శేరి మహేందర్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ముత్తాయికోటలోని శివాలయం దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో మైనంపల్లి హన్మంతరావు, సతీమణి వాణి లు పాల్గొన్నారు. అనంతరం ఏడుపాయల దుర్గాభవాని మాతను మైనంపల్లి హన్మంతరావు కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుపాయల అభివృద్ధిపై డెవలప్ మెంట్ కమిటీ ని ఏర్పాటు చేస్తానని అన్నారు. రాజకీయంగా నా కొడుకును ఆశీర్వదించి ఎమ్మెల్యేగా తీర్చిదిద్దిన ఏడుపాయల అమ్మవారి రుణం తీర్చుకుంటానని అన్నారు. యాదాద్రి తరహాలో ఏడుపాయల దుర్గమ్మ దేవాలయాన్ని సుందరీకరిస్తానని తెలిపారు. పక్కా షెడ్ ల నిర్మాణంతో పాటు యాత్రికులు ఉండేలా వంద రూములతో వసతి సత్రాలను నిర్మింపజేస్తామని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల రాజేష్, న్యాయవాధి జీవన్ రావ్, బొజ్జ పవన్, హావేళిఘణపురం మండల నాయకులు శేరి మహేందర్ రెడ్డి, పరుశురాం, లక్కరి శ్రీనివాస్ లతో పాటు పాపన్నపేట మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, ప్రభాకర్ రెడ్డిలతో పాటు చిన్నశంకరంపేట మండల నాయకులు గంగా నరేందర్, రాజిరెడ్డి, గోపాల్ రెడ్డి, సత్యనారాయణలతో పాటు ఏడుపాయల దేవస్థానం చైర్మెన్ బాలాగౌడ్ తోపాటు ఆలయ ఇ.ఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
.