తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజులరామారం దేవేందర్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో చెత్తాచెదారంతో కాలుష్యం అవుతున్న పట్టించుకోని అధికారులు ఎమ్మార్వో ఆఫీస్ దగ్గరనే ఇలా ఉంటే కాలనీల పరిస్థితి ఏంటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో ఉన్న చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచి చెత్త డబ్బా ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
