తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) గాజులరామారం దేవేందర్ నగర్ సర్వేనెంబర్ 329/1, 342 లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన 120గజాల స్థలమును కాపాడాలని సోమవారం రమేష్ నాయక్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 సంవత్సరాల నుండి అంగన్వాడికి కేటాయించిన స్థలమును కాలనీవాసులంతా కలిసి కాపాడుకుంటూ వస్తున్నామని, చింతలకు చెందిన ఓ మహిళ ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా గదిని నిర్మించింది. ఇది అంగన్వాడి స్థలం కదా ఇక్కడ ఎందుకు గదిని నిర్మిస్తున్నావని కాలనీవాసులందరూ ప్రశ్నించగా మాపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిందని అన్నారు. ఇకనైనా ఎమ్మార్వో స్పందించి కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంజమ్మ, కృష్ణ, సోనీ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
