పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కూరపాటి రమేష్.
సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): రాజకీయాల పక్కన పెట్టి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి కల్పించాలని కోరుతూ నేత కార్మికులు అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ లు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కూరపాటి రమేష్ మాట్లాడుతూ సిరిసిల్లలో మూడు నెలలుగా వస్త్ర పరిశ్రమ మూతపడడంతో పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ పరిశ్రమల కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పై నెట్టివేయకుండా తక్షణం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రాజకీయాలు చేయకుండా కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిరసన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ముసం రమేష్, కోడం రమణ, గణేష్, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అన్ని విభాగాలకు చెందిన నాయకులు కార్మికులు పాల్గొన్నారు.
