నూరు శాతం పన్నులు వసూలు చేశాం.. అభివృద్ధికి సహకరించండి

బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోల్గం నాగరాజ్ గౌడ్.

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): సిరిసిల్ల మున్సిపాలిటీ లో తొలిసారిగా నూరు శాతం పన్ను వసూలు చేసిన తమ వార్డుకు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని పదవ వార్డ్ కౌన్సిలర్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొల్గం నాగరాజు గౌడ్ కోరారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా నాగరాజు గౌడ్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో సిరిసిల్ల మున్సిపాలిటీ లోనే తొలిసారిగా నూరు శాతం పన్నులు వసూలు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం తమ వార్డు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు నాగరాజు గౌడ్ తెలిపారు.

.