మహిళా చైతన్య దీప్తి సావిత్రీబాయి పూలే

టీబీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే వర్ధంతి వేడుకలు     

తెలంగాణ ప్రభ (కోరుట్ల):మహిళా అభ్యున్నతికి కృషి చేసిన మొట్ట మొదటి బహుజన మహిళ సావిత్రీబాయి పూలే అని టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.

ఆదివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని నేతాజీ వృత్తి విద్య కాలేజీలో టీ బీసీ విద్యార్థి జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే వర్ధంతి వేడుకలు జరిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ సావిత్రీబాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను,ఉద్యోగులను 12 మందిని పట్టు శాలువల్తో,అవార్డులతో  సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  సావిత్రీబాయి లాంటి సామాన్య మహిళ  సామాజిక చైతన్యం నేటి తరం మహిళలకు,మహిళా  ఉపాధ్యాయులు,ఉద్యోగులకు,విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారుబాల్య వివాహాలకు,మూఢ నమ్మకాలకు,సతీ సహగమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపిందని,వితంతు పునర్వివాహాల కోసం కృషి చేసిందన్నారు.

1997 లో సావిత్రీబాయి పూలే సంస్మరణార్థం  భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసిందని,పూణే యూనివర్సిటీకి సావిత్రీబాయి పూలే పేరు పెట్టారని,మహారాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి పూలే పేరిట స్మారక భవనాన్ని నిర్మిస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం సైతం జ్యోతిరావు పూలే,సావిత్రి భాయి పూలే ల స్మారకార్థం ఒక భవనాన్ని హైదరాబాద్ లో నిర్మించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో టీబీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి విజయ్,ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్,ఆర్గనైసింగ్ కార్యదర్శి వెలముల ప్రకాష్,ఉమ్మడి జిల్లా విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు ధోనూరి భూమాచారి,జిల్లా కార్యదర్శి పి.నవీన్,మహిళా జేఏసీ జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి,కార్యదర్శి పుప్పాల విజయ,  మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగం జలజ, సంయుక్త కార్యదర్శి బక్కశెట్టి లక్ష్మీ, సంక్షేమ జిల్లా ప్రధాన కార్యదర్శి ములస్తం శివ ప్రసాద్, ,టీ బీసీ జేఏసీ సంక్షేమ,యువజన,విద్యార్థి,మహిళా,ఉద్యోగ జేఏసీ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

.