తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): ఎమ్మెల్యే కార్యాలయం లో ఆదివారం జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన పాపిరెడ్డి నగర్, దేవమ్మ బస్తీ వాసులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి కాలనీలలో ఎప్పటి నుంచో ఉన్నటి వంటి భూగర్భ డ్రైనేజీ సమస్యను తీర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మౌలిక వసతులలో భాగంగా కాలనీలలో సీసీ రోడ్డు పనులను చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ అన్ని బస్తీలు, కాలనీలలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న రోజుల్లో పాపిరెడ్డి నగర్, దేవమ్మ బస్తీలలో మరింత అభివృద్ధి చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో తేరాల శ్రీనివాస్, అంజయ్య, వీరాచారి, సతీష్, రాములు గౌడ్, కుమార్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
.