తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పురాతన శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి నవ్య దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానస రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్ గౌడ్, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు రాజన్న, మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, కాంగ్రెస్ నాయకులు వైద్య శివప్రసాద్, మోర లక్ష్మీరాజ్యం, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్,ఎంపీటీసీలు దుర్గాప్రసాద్ నరసయ్య, ఆంజనేయులు, ఆసాని జయశ్రీ కో సంధ్యారాణి, ఆసాని లావణ్య, దేవాలయ పూజారులు దిడ్డి భాస్కర్, శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు
.