మల్లన్న జాతరకు సర్వం సిద్ధం

నేటి నుండి ఉత్సవాలు ప్రారంభం

ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు

నేడు అగ్గి గుండాలు బండ్లు బోనాలు ఊరేగింపు

తెలంగాణ ప్రభ ( హత్నూర): నియోజకవర్గంలోని హత్నూర   మండల పరిధిలోని మహా జాతరగా పేరుగాంచిన సాదుల్ నగర్  గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన శనివారం నాడు మల్లన్న క్షేత్రంలో జరుగుతున్న మహా జాతరకు చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలయ పూజారి నర్సింలు యాదవ్ తెలిపారు.అంతేకాకుండా ఈ జాతర మహోత్సవానికి వివిధ రకాల రంగులతో అలంకరించి ఆలయం చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి జాతరకొచ్చిన భక్తులకు పూజలు పురస్కారాలతో ఏర్పాటు జరుగుతున్నాయి. భక్తులకు ఎండ తగలకుండా పచ్చటి తోరణాలతో పందిరి వేసి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమంతో మంచినీటి సౌకర్యం కల్పిస్తూ జాతర అంగరంగ వైభవంగా జరిగేటట్టు చూస్తామని ఆయన అన్నారు.

.