శివనామస్మరంతో మారుమోగిన శివాలయాలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని పలు శివాలయాలలో నిర్వహించిన వేడుకల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  పాల్గొని ఆ నీలకంఠుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  మాట్లాడుతూ నిరాకారుడు, నీలకంఠుడు అయిన ఆ పరమేశ్వరుని కొలవడం ద్వారా మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు.

అంగడిపేటలో....

జీడిమెట్ల డివిజన్ అంగడిపేటలోని శివాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే తో పాటు డివిజన్ బిఆర్ఎస్ నాయకులు కుంట సిద్ధిరాములు, జైపాల్ గౌడ్, అనిల్ గౌడ్, వినీత్, దీక్షితులు పంతులు, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, జగద్గిరిగుట్ట శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్,  సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మాణిక్య నగర్ లో...

కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ లోని కాశీ విశ్వేశ్వరాలయంలో నిర్వహించిన శివరాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , మాజీ కార్పొరేటర్ కెఎం.గౌరీష్ తో కలిసి స్వామివారికి పూజలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, నాయకులు కిషోర్ చారి, మహేష్, ఖలీల్, రమేష్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.


శ్రీరామ్ నగర్ - ఏ కాలనీలో....

 గాజుల రామారం డివిజన్ శ్రీరామ్ నగర్ - A కాలనీలోని శ్రీ శివ మార్కండేయ స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి పూజా కార్యక్రమాల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  పాల్గొని శివ మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.

ఈ పూజా కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, ఆలయ ధర్మకర్త రాజశేఖర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, సింగార మల్లేష్, మహేష్, సుజాత, లక్ష్మణ్ గౌడ్, సతీష్ గౌడ్, సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, సుభాష్ నగర్ డివిజనల్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సూరారం కాలనీ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయంలో...

 సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీలోని ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కుమ్మరి కృష్ణ, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సీనియర్ నాయకులు యూసుఫ్, గుబ్బల లక్ష్మీనారాయణ, వెంకటస్వామి, పందిరి యాదగిరి, రాజ్ కుమార్, ప్రభాకర్, రవి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


సూరారం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో...

సుభాష్ నగర్ డివిజన్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద  పాల్గొని నిరాకారుడు, నీలకంఠుడు అయిన ఆ దేవదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ముద్దాపురం మధన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, గుబ్బల లక్ష్మీనారాయణ, మహేష్ గౌడ్, కూన రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సుభాష్ నగర్ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో...

సుభాష్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ నందుగల కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద  పాల్గొని ఆ గంగాధరుడైన మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బిజిలి సాంబయ్య, డిజైనర్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, సీనియర్ నాయకులు ఎం.ఎస్.వాసు, గుబ్బల లక్ష్మీనారాయణ, అడప శేషు, అనోక్, బిజిలి గోపి, బిజీలీ యువరాజ్, నదీమ్ రాయ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

.