బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 4 గురికి, మద్యం సేవించి వాహనాలు నడిపిన 23 మందికి జరిమానా

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి);తంగళ్ళ పల్లి మండలంలో గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని, భహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిని గురువారం సిరిసిల్ల మేజస్ట్రేట్ కోర్టులో తంగళ్ళ పల్లి పోలీసులు హాజరు పర్చగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున వెయ్యి రూపాయల జరిమానా, మరియు మద్యం సేవించి వాహనాలు నడిపిన 23 మందిని సిరిసిల్ల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఆరుగురికి 2000 చొప్పున మరియు 17 మందికి వెయ్యి రూపాయలు చొప్పున అదనపు మెజిస్ట్రేట్ సృజన జరిమానా విధించడం జరిగిందని తంగళ్ళపల్లి ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిoచారు. మార్చి నెలలో నిర్వహించిన మెగాలోక్ అదాలత్ లో కక్షిదారులు పెద్ద ఎత్తున హాజరై తమ యొక్క కేసులని  రాజీ పడే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

.