ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాల వితరణ

తెలంగాణ ప్రభ, (సిరిసిల్ల): పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలిచేందుకు ఆంగ్ల భాష నైపుణ్యం తప్పనిసరి అవసరం అని పలువురు వక్తలు అన్నారు  అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో  గురువారం మహతి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు స్థానిక ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ ఇంగ్లీష్ భాషా నిపుణులు బూర శ్రీనివాస్, జె. ఎస్ అరవింద్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో అన్ని రంగాల్లో రాణించేందుకు ఇంగ్లీష్ భాష నైపుణ్యం అత్యవసరం అని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలో డిగ్రీ పూర్తి చేసుకునే విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రదీప్తీ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయం అన్నారు అనంతరం 150 మంది  ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థినులకు బూర శ్రీనివాస్ రచించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గెంట్యాల భూమేశ్ అధ్యాపక బృందం డి లక్ష్మి, శరత్ కుమార్, డీ .రమేష్, దామెర  స్వామి, తోట రాజేందర్, విద్యార్థులు పాల్గొన్నారు

.