ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలు కూల్చివేత

చినదామర చెరువు కబ్జా చేసి కాలేజ్ నిర్మాణం చేపట్టారని ఆరోపణ 

కూల్చివేతలను అడ్డుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెందిన అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. దుండిగల్ చిన్న దామర చెరువు ఎలాంటి అనుమతి లేకుండా మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ నిర్మించారు కాలేజీని కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులను కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్థులు అడ్డుకున్నారు అధికారుల వైపు ఒక్కసారిగా ఉపాధ్యాయులు విద్యార్థులు చొచ్చుకురాగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చర్యలు నశించాలని కాలేజీ యాజమాన్యం ఆందోళనకు దిగింది ఆందోళన జరుగుతాయని పోలీసులకు ముందే తెలిసిన అదుపు చేయలేకపోయారని అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నదామర చెరువు అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంఘీభావంగా ఎమ్మెల్సీ శంబిపూర్  రాజు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు నిర్మాణాలకు కూల్చివేతలను అధికారులను ప్రశ్నించగా నిబంధనకు లోబడే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేలు చేసేదేం లేక అక్కడి నుండి వెళ్లిపోయారు.

.