తెలంగాణ ప్రభ (కోరుట్ల): విద్యతో పాటు ఆటల పోటీలలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విశేష ప్రతిభ కనబరుస్తున్న కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఎంఈఓ గంగుల నరేశం, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి అభినందించారు. గురువారం కోరుట్ల పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కోరుట్ల పబ్లిక్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ లో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, మండల విద్యాధికారి గంగుల నరేశం, డాక్టర్ రాజేష్ రేగొండ, గండ్ర అన్వేష్ లు హాజరయ్యారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటల పోటీలలో ఆడి పాడిన ఆటపాటలతో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులను శాలువా మెమొంటోలతో కోరుట్ల పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాలలు విద్యార్థులు చదువులతో పాటు ఆటల పాటలపై దృష్టి సారించాలని మేము చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆటపాటలలో గెలుపొందిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులు అతిథులచే మెమొంటోలు అందించి అభినందించారని, తద్వారా కోరుట్ల పట్టణానికి తల్లిదండ్రులకు, ఇటు పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు పలు రంగాలలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడం పి ఈ టి ఆటలపై విద్యార్థులకు చూపించిన నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని దానికి తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహం అధ్యాపకుల సహకారం వలన అనేక బహుమతులు గెలుచుకొని కోరుట్ల పట్టణానికి మంచి పేరు తీసుకొస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కేర చంద్రశేఖర్, మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు గోడికే రాజ్ కుమార్, మన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అల్లే రాము విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులున్నారు.
.