తెలంగాణ ప్రభ(ధర్మపురి): మగిడి ఆదర్శ పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల వివిధ ప్రాంతాల నుంచి 40 మందికి పైగా విద్యార్థులు వివిధ కేటగిరిలో పోటీ పడ్డారు. ఎంపిక చేసిన విద్యార్థులు ఈనెల తొమ్మిది పది తేదీల్లో హైదరాబాదులో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు. సబ్ జూనియర్ విభాగంలో శ్రావణి, ఆలోహిత, సాత్విక జూనియర్ మహిళా విభాగంలో కే పూజిత, త్రిష, సాహితి, అనూష,బాయ్స్ సబ్ జూనియర్ అండ్ జూనియర్స్ శ్రావణ్, వికాస్ నవనీత్, రాహుల్, రాష్ట్ర స్థాయి సెలెక్ట్ అయ్యారు.వీరిని మోడల్ స్కూల్ మగిడి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న, జగిత్యాల పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ రాజేందర్,అధ్యాపక బృందం అభినందించారు.
