పామ్ ఆయిల్ పంటతో అధిక దిగుబడి

తెలంగాణ ప్రభ(ధర్మపురి): పామ్ ఆయిల్ పంట తో అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులు పామ్ ఆయిల్ పంట సాగుచేయలని   జిల్లా వ్యవసాయ అధికారి వాణి తెలిపారు. గురువారం మండలం లోని నేరేళ్ల గ్రామంలో ఆమె  క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. వివిధ రకాల పంటల్లో వచ్చు చీడపీడల నియంత్రణ గురించి రైతులకు తెలపారు.  పామాయిల్ పంటలో అంతర పంటలు పండించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని  తెలంగాణ భూములు పామ్ ఆయిల్ పంట కు అనుకూలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్ ఏఈవోలు మౌనిక,సమత రైతులు తదితరులు పాల్గొన్నారు.

.