ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని వినతి పత్రం హాస్యాస్పదం..

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కోరడం హాస్యాస్పదమని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ అన్నారు. 

గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ ఎల్ఆర్ఎస్ స్కీంను తీసుకువచ్చి ప్రజలను ఆగం చేసి వేల కోట్ల రూపాయలు సామాన్య మధ్య తరగతి ప్రజల నుండి వసూలు చేసి ఇప్పుడు దానిని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లను కలసి వినతి పత్రాలు సమర్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు 

గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పై రుద్ది రాద్ధాంతం చేయటం సమంజసం కాదని నిజంగా బిఆర్ఎస్ నాయకులు చిత్తశుద్ధి ఉంటే ఎల్ఆర్ఎస్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారో ప్రజలకు వివరించి ప్రజలను క్షమాపణ కోరాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతుందని, దీనిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు కావాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారి మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తుందని, పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు ఈకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయిం మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడెపు మధు కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం సంగ లింగం ఆన్వర్ లోకీని వెంకీ తదితరులు పాల్గొన్నారు

.