ఘనంగా మహిళ దినోత్సవం

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి మండలం లోని ఆరెపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు.  మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయ్ పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల లోని బోధన మరియు బోధనేతర మహిళా సిబ్బంది కి ఘనం గా సన్మానించారు.ఈ సందర్భంగా  పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెజ్జంకి నితిన్ కుమార్ మాట్లాడుతూ  అన్ని ప్రభుత్వ విభాగాల్లో మహిళ ఉద్యోగ ఉపాధ్యాయునిలు అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. అటు కుటుంబానికి సమయం కేటాయిస్తునే ఇటు తన విధులను సైతం సక్రమంగా నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మ్యాన పవన్ కుమార్,గుగ్గిల సరోజ,దుంపేట చామంతి తదితరులు పాల్గొన్నారు.

.