"రెడీమిక్స్ లారీ డ్రైవర్స్ కి న్యాయం చేసిన"

బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్...

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): రాజేందర్ నగర్ పరిధిలోని ఇండస్ట్రీ ఏరియా "రెడీ మిక్స్"లారీ ఓనర్ రాకేష్ రెడ్డి దగ్గర ఎండి తాజావుద్దీన్, రాజారాం రావు, రాజ్ కుమార్ సింగ్, అనే ముగ్గురు కార్మికలు డ్రైవర్ గ గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది.ఆ ముగ్గురు డ్రైవర్స్ కొన్ని అనువార్య కారణాలవల్ల డ్రైవర్స్ డ్యూటీ మానేయడం జరిగింది... డ్రైవర్స్ కు రావలసిన గత సంవత్సరం క్రితం డిసెంబర్ నెల వేత్తనం ఇవ్వాల్సి ఉండగా లారీ ఓనర్ రాకేష్ రెడ్డి, వేత్తనం ఇవ్వకుండా దుర్భాషలాడి డ్రైవర్స్ నీ బెదిరించి పంపించేవాడు అతనికి ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి డ్రైవర్ల ద్వారా తెలుసుకొని  బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని కార్యాలయం వద్దకు వెళ్లి డ్రైవర్స్ కి జరిగిన అన్యాయం చెప్పుకున్నారు, ఆ తర్వాత వెంటనే స్పందించిన రవిసింగ్ హుటాహుటిన రెడీమిక్స్ ఓనర్ రాకేష్ రెడ్డి దగ్గరికి వెళ్లి డ్రైవర్స్ ముగ్గురికి కలిపి రావలసిన వేత్తనం ఒక్కొక్కరికి 20000/- వేలు ఉండగా మొత్తం 60/- వేల రూపాయలు  మాట్లాడి, డ్రైవర్స్ ముగ్గురికి ఇప్పించడం జరిగింది... డ్రైవర్స్ మాట్లాడుతూ మాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, తదితరులు పాల్గొన్నారు.

.