తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో మహిళాదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు సృష్టికి మూలం మహిళ అన్నారు. మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడుతారో అక్కడే సుఖశాంతులు వర్దిల్లుతాయని పేర్కొన్నారు. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్బంగా ఉపాద్యాయిణీలకు ఆటల పోటీలు నిర్వహించారు.అనంతరం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి, ఉపాద్యాయిణీలు సుమంగళి,శోభ, రేఖ, రేవతి, లావణ్య, మౌణిక, స్వాతి, షమీమ, మౌణిక, సునంద, మహాలక్ష్మిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
