కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేద ప్రజలకు వరం

గృహ జ్యోతి జీరో రిషిఫ్ట్ పత్రాలను  అందిస్తున్న ఎంపీపీ

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట ): మండలంలోని వంతడుపుల  గ్రామంలో ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణారెడ్డి గృహజ్యోతి జీరో రిసిప్ట్ పత్రాలను అందజేశాడు, ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని తుచా తప్పకుండా అమలు చేస్తున్నాదాని తెలిపాడు,

మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే  కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో మానకొండూరు నియోజకవర్గం ను అన్నిరంగాలలో అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

గృహ జ్యోతితో ఎంతోమంది పేద,మద్యతరగతి ఇండ్లలో వెలుగులు నిండాయన్నారు. చాలామంది కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

.