తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఈనెల 10వ తారీఖున కరీంనగర్ లో జరిగే గౌడ సంఘ ఆత్మీయ సన్మానాన్ని విజయవంతం చేయాలని గౌడ సంఘ నాయకులు కోరారు. గౌడ జాతి ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా వారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గౌడ కులస్తులందరూ ఆత్మీయ సన్మానాన్ని చేస్తున్నారని, దీనిని విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా మరియు కోరుట్ల నియోజకవర్గం గౌడ కులస్తులందరూ కరీంనగర్ కు తరలివచ్చి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు బీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, గౌడ సంఘ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరుమల్ల సత్యనారాయణ గౌడ్ ,తెలంగాణ గౌడ గీత కార్మిక సేవ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు , బిసి సెల్ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం తిరుపతి గౌడ్ ,సీనియర్ గౌడ సంఘ నాయకులు జిల్లా మాజీ కె.డి సి.సి. డైరెక్టర్ నగునూరి గంగాధర్ గౌడ్ ,గౌడ సంఘ నాయకులు పుల్ల కిషన్ గౌడ్, పోతుగంటి శంకర్ గౌడ్ మోతుకూరి కిషన్ గౌడ్, ముంజ రాజగౌడ్, పెరుమల్ల వెంకటేశం గౌడ్, ఎల్లా గౌడ్ , గడ్డం సురేష్ గౌడ్ తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు
.